VIDEO: శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
HYD: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్‌కి మద్దతుగా గాంధీ ఆసుపత్రి వద్ద బీసీ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.