ధాన్యం కుప్పకు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
NRPT: రోడ్డు పై ఉన్న ధాన్యం కుప్పను ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తపల్లె మండల పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి మండలంలోని భూనీడు, దుప్పటి గట్టు గ్రామాల మధ్య రహదారిపై ఉన్న వరి ధాన్యం కుప్పపై నల్లటి టార్పలిన్ కవర్ కప్పడంతో దానిని ఢీకొని నారాయణపేట మండలం బండగొండ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.