VIDEO: 'రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'
MBNR: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణగూడలో బీసీ విద్యార్థి సంఘం ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీలు కూడా బకాయిలతో ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.