పోషన్ అభియన్‌లో భాగంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం

మంచిర్యాల్: మున్సిపాలిటీ పరిధిలోని దొరగారిపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు మల్లీశ్వరి, సుజాతలు మాట్లాడుతూ.. బాలింతలు, గర్భిణులు , చిన్నారులు పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు.