తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి బాట గంగమ్మ గుడి వరకు భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం మొత్తం 86,091 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 29,664 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లుగా నమోదైంది.