ముదరంపల్లెలో ఇళ్ల పట్టాల పంపిణీ

ముదరంపల్లెలో ఇళ్ల పట్టాల పంపిణీ

చిత్తూర్: ముదరంపల్లె పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 47 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చేతులు మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని, మరోవైపు అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.