' యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు'

మేడ్చల్: 65వ భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్, రామంతాపూర్, మల్లాపూర్ డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ పటేల్ జెండా ఆవిష్కరించారు. అరుణ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర గణనీయమైనదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ అధ్యక్షుడు అశోక్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సచిన్ పాల్గొన్నారు.