'రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన ప్రభుత్వం'

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను గాలికి వదిలేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ మండలం తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో యూరియా సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వాన్ని విమర్శించారు.