ఈ నెల 18న కూసుమంచి శివాలయంలో దుకాణాల బహిరంగ వేలం

BDK: కూసుమంచిలోని శ్రీ గణపేశ్వరాలయంలో దుకాణాల నిర్వహణ కోసం ఈ నెల 18న బహిరంగ వేలం జరుగుతుందని దేవాలయ ఛైర్మన్ రేలా ప్రదీప్ రెడ్డి, ఈవో శ్రీకాంత్ తెలిపారు. ఆలయంలో ఏడాది పాటు పులిహోర, లడ్డూ దుకాణాలను నడపడానికి ఈ వేలంపాట ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు రూ.5,000 దరఖాస్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని అధికారులు వెల్లడించారు.