VIDEO: రోడ్డుపై నాట్లు వేసి నిరసన

VIDEO: రోడ్డుపై నాట్లు వేసి నిరసన

KMM: చింతకాని మండలం నాగులవంచలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న శ్రీకనకదుర్గ కాలనీలో వీధి రోడ్లు అధ్వానంగా తయారైందని, వర్షాలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు లేక చిన్నపటి వర్షం వల్ల వరద నీరు రహదారిపై చేరడంతో స్థానికులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలన్నారు.