'వార్డు సచివాలయ ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలి'

KDP: వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ రమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వార్డు సచివాలయ సిబ్బంది ఇంఛార్జ్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి సమస్యలను వివరించారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ మంజూరు చేయాలన్నారు. వాలంటీర్‌ల బాధ్యతలు తమకు అప్పగించవద్దన్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.