తుఫాన్ వరదనీటిలో మునిగిన పౌర సరఫరా సరుకులు
VSP: పెదనాగ మల్లయ్యపాలెంలో మొంథా తుఫాన్ వరద నీటిలో నిత్యావసర సరుకులు మునిగిపోయాయి. పౌర సరఫరాల దుకాణం నెంబర్ 4344 గోడౌన్లోకి వరద నీరు చేరి సరుకులు నీట మునిగాయి. అధికారులు గోడౌన్లో ఎంత మేర సరుకులు తడిచాయి అనేది అంచనా వేస్తున్నారు. స్థానికుల సహాయంతో రెవెన్యూ అధికారులు సరుకులను మరో చోటకు తరలిస్తున్నారు.