'గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి'

SRPT: గ్రామల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు పెన్పహాడ్ మండలం ముకుందపురంలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పాలకులు వెంటనే పరిష్కరించాలని లేకుంటే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.