నకిలీ యాప్‌లతో జాగ్రత్త: సీఐ

KKD: పీఎం-కిసాన్ యోజన పేరుతో నకిలీ యాప్ లింకులు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ హెచ్చరించారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఓటీపీ అడగకుండా హ్యాకర్లు మొబైల్‌ను హ్యాక్ చేసి, బ్యాంక్ వివరాలు దొంగిలించి డబ్బును ఖాళీ చేస్తారని తెలిపారు. ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.