VIDEO: మున్సిపల్ కౌన్సిల్‌లో “అంకుల్” వివాదం
మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం BRS కౌన్సిలర్ తేజస్విని, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్‌ను సభలో “అంకుల్” అని పిలవడంతో కాంగ్రెస్స్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదం, అరుపులతో గందరగోళం వాతవరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో సీపీఐ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి జోక్యం చేసుకుని ఇద్దరు వర్గాలను సమాధానపరిచి కూర్చోబెట్టారు.