రాజమండ్రి-విశాఖ మధ్య మరో రెండు లైన్లు
E.G: కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి అంగీకరించింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ ఈ లైన్లు నిర్మించనున్నారు. ఈ విస్తరణ వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.