ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్
మేడ్చల్: రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్. షీ టీమ్స్ ఆధ్వర్యంలో 110 మంది ఈవ్ టీజర్లకు ఎల్‌బీ నగర్ ఉమెన్ సేఫ్టీ ఆఫీసులో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీసీపీ టి. ఉషారాణి మాట్లాడుతూ.. వారిని సాక్ష్యాలతో సహా న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 15 వరకు మొత్తం 135 వేధింపుల ఫిర్యాదులు వచ్చాయని, అందులో ఫోన్ ద్వారా 34, SMలో 48, నేరుగా 53 ఫిర్యాదులు చేశారన్నారు.