భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల క్షేత్రం
NDL: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ భక్తులతో పాటు శివస్వాములు సైతం వేలాది సంఖ్యలో చేరుకుంటున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి మంగళవారం ఉదయానికి 28,341 మంది భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.