మల్లంపల్లి పోలింగ్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ

మల్లంపల్లి పోలింగ్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ

MLG: మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ సందర్శించి, పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో చేపట్టవలసిన చర్యల గురించి పోలీసు అధికారులకు ఆయన సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు సూచించారు.