కారు బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు
KMM: బోనకల్ - ముష్టికుంట్ల మధ్య మంగళవారం జరిగిన ఘోర కారు ప్రమాదంలో రావినూతలకు చెందిన కొమ్మినేని కమలాకర్తో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన కారు నియంత్రణ తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.