VIDEO: గుంతలమయంగా మారిన పొచ్చెర రహదారి
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర ప్రధాన రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు జంకుతున్నారు. అడుగుకో గుంతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్లతో ప్రమాదాలు పెరిగి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలనీ గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.