భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయం, ఉప్పులూరు, ఏర్గట్లలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. మూడేళ్లుగా కమ్మర్‌పల్లి జంబి హనుమాన్ ఆలయంలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లు భక్తులు పేర్కొన్నారు.