శాంతి భద్రతలు విఫలమయ్యాయి: మాజీ ఎమ్మెల్యే

శాంతి భద్రతలు విఫలమయ్యాయి: మాజీ ఎమ్మెల్యే

NLR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. ఇందుకూరుపేటలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అవినీతి అక్రమాలు ఎక్కువైపోయాయి అని విమర్శించారు. ప్రజల గుండెల్లో నుండి పుట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.