తన పెళ్ళికి రావాలని సీఎంను ఆహ్వానించిన జీసీసీ ఛైర్మన్
ASR: సీఎం చంద్రబాబును జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఇవాళ కలిశారు. అమరావతి సచివాలయానికి మంత్రి సంధ్యారాణితో కలిసి వెళ్ళిన జీసీసీ ఛైర్మన్.. తన వివాహానికి రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మే 13న తన పెళ్ళి పాడేరులో జరుగబోతోందని, తన వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి తమను ఆశీర్వదించాలని సీఎంను జీసీసీ ఛైర్మన్ కోరారు.