పెద్ద జట్రం గ్రామానికి ఎంపీ డీకే అరుణ రాక..!
NRPT: ఊట్కూర్ మండలం పెద్ద జట్రం గ్రామంలో గురువారం ఎంపీ డీకే అరుణ పర్యటించనున్నట్లు బీజేపీ గ్రామ అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐమాస్ట్ లైట్లు, సీసీ రోడ్ల వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె ప్రారంభోత్సవం చేయనున్నారు. సర్పంచ్ వాకిటి వెంకటేష్‌తో కలిసి పలువురు అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.