బాధిత కుటుంబాన్ని పరామర్శించిన యువనేత
SKLM: నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన సూర్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య సోమవారం ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.