స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి

KNR: శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున 15వ తేదీ ఉదయం 8 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్య ఉత్తర్వులు జారీ చేశారు.