పాక్ గూఢచర్యం.. CRPF జవాన్ అరెస్ట్

పాక్ గూఢచర్యం.. CRPF జవాన్ అరెస్ట్

పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న CRPF సిబ్బంది ఒకరిని NIA అధికారులు అరెస్టు చేశారు. CRPF ASIగా పని చేస్తున్న మోతీ రామ్ జాట్ పాక్‌కు కీలక సమాచారం చేరవేసినట్లు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ దాడి జరగడానికి కేవలం ఆరు రోజుల ముందే అతడిని బదిలీ చేసినట్లు గుర్తించారు. కాగా, అతడికి జూన్ 6 వరకు NIA కస్టడీకి అప్పగిస్తూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.