10 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం
NZB: మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో వర్ని మండలంలో 10 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రూప్లానాయక్ తండా, సిద్ధాపూర్, వకీల్ ఫారం, ఆఫంది ఫారం, సైదాపూర్, శంకోరా,రాజ్ పేట్, చల్కతాండ, చింతల్ పేట్ తాండా, మల్లారం గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.