భీమన్నను దర్శించుకున్న బాంబే హైకోర్టు జడ్జి
SRCL: వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందేశ్ ఎస్ దేశ్ పాండే కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం అందజేసి, స్వామివారి శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదంను అందజేశారు.