ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం

WNP: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తహసీల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చునని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్తకోటలో ఇందిరమ్మ నమూనా ఇంటి భవనాన్ని ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందిన అందరూ లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణపనులను ప్రారంభించుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు దశలవారీగా నగదు అందజేస్తామన్నారు.