VIDEO: బీచ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచిన సీపీ
విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లో శనివారం శంఖబ్రత బాగ్చి నేతృత్వంలో పోలీసులు శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తీరప్రాంతాల్లోని ప్లాస్టిక్, లోహాలు తదితర వ్యర్థాలను తొలగించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత హీ సేవా వంటి జాతీయ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నరు.