'మోసగాళ్లపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం'

VZM: ఉద్యోగాల పేరుతో లక్షలు గుంజుకున్న వ్యక్తులపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరినాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో విద్యార్థుల నుండి డబ్బులు కాజేస్తున్న బొండపల్లి కొత్తవలస మండలాలకు చెందిన వ్యక్తులపై విద్యార్థులు గౌరీ నాయుడుకు ఫిర్యాదు చేశారు.