పులివెందులలో మానవత శాంతి ర్యాలీ

KDP: మానవత స్వచ్ఛంద సంస్థ పులివెందుల శాఖ ఆధ్వర్యంలో మానవత శాంతి వారోత్సవాల సందర్భంగా ప్రపంచ శాంతి కోసం మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, మానవత ఛైర్మన్ డీవీ.కొండారెడ్డి మంగళవారం జెండాను ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ర్యాలీ పాత బస్టాండ్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు సాగించారు. గాంధీ విగ్రహంనికి పూలదండ వేసి, శాంతి కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మానవత సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.