ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

SRD: పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 60 లక్షల నిధులతో నాలుగు అదనపు తరగతి గదులను నిర్మించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ముత్తంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాల గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన అన్నారు.