ట్రావెల్స్ బస్సు బోల్తా..

VZM: జిల్లాలోని చెల్లూరు వద్ద ఇవాళ ఉదయం ట్రావెల్ బస్సు బోల్తా పడి 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ టు విజయనగరానికి వస్తుండగా చెల్లూరు వద్ద తిరిగి వెళ్తున్న క్రమంలో డివైడర్ పైకి బస్సు వెనుక టైరు ఎక్కడంతో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.