రేపు ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక పూజలు
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో గురువారం ఉదయం భీష్మ ఏకాదశి సందర్భంగా గర్భాలయంలో సీతా రామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, రాములోరి ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు.