త్వరలో బీఆర్ఎస్‌లోకి మాజీ మున్సిపల్ ఛైర్మన్..?

GDWL: గద్వాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేశవ్ అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్తానిక సంస్ధల ఎన్నికలలో తప్పకుండా ప్రాధాన్యతను ఇస్తామని ముఖ్యనాయకులు ఎవరూ కూడా హామీ ఇవ్వకపోవడంతో.. కేశవ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6వ తేదీన కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి BRSలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.