'డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

WNP: డెంగ్యూ వ్యాధి రాకుండా నివారించడానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని వనపర్తి జిల్లా DMHO శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.