సైదాపూర్‌లో ఆగని యూరియా గొడవలు

KNR: యూరియా కొరత రైతులతో పాటు వ్యవసాయ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అవసరానికి మించి రైతులు యూరియాను వాడటంతో యూరియా కొరత మరింత తీవ్రంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒకచోట యూరియా కోసం రైతులు ఆందోళన చేపడుతూనే ఉన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.