'సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలి'
NLR: ఉదయగిరి వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయ పరిధిలో పనిచేసే వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ సహాయ సంచాలకులు ఈ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం తన కార్యాలయంలో ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం అందించే వ్యవసాయ రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.