‘కాంగ్రెస్ కనుసన్నల్లోనే యూరియా బ్లాక్ మార్కెట్’

TG: రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారం కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమన్నారు. రైతుల కోసం కేటాయించిన యూరియాను కాంగ్రెస్ నాయకులే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. మిర్యాలగూడ కాంగ్రెస్ MLA గన్‌మన్ లారీ లోడ్ యూరియాను ఎత్తుకుపోవడమే దీనికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.