దేవాలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి గురువారం సందర్శించారు. ఆలయ ధర్మకర్తలు దుస్సాలతో సత్కరించారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.