ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా సురేశ్ బాధ్యతలు

ప్రకాశం: పశ్చిమగోదావరి ఏఆర్ పోలీస్ విభాగం నుంచి బదిలీ అయిన డి.సురేశ్, ప్రకాశం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగం ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. శనివారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందించారు. అనంతరం ఎస్పీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.