ఓపీఎస్ అమలు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావును ఆయన క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులు కలసి నూతన పెన్షన్ విధానం వద్దని పాత పెన్షన్ విధానమే కోనసాగించాలని వినతి పత్రం అందజేశారు. 11,000 మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో16 రాష్ట్రాలు అమలు చేస్తున్న, ఏపీలో నూతన విధానం అమలులో ఉందన్నారు.