రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

KDP: సిద్దవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి మాధవరం-1బస్టాండ్ స్పీడ్ బ్రేకర్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న మాధవరం-1 SKR నగర్ గ్రామానికి చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.