గుమ్మలక్ష్మిపురంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మిపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో డొంకాడ రామకృష్ణతో పాటు పలు నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.