'నన్ను జైలులో పెట్టినా ప్రశ్నిస్తా'
కృష్ణా: అక్రమ నిర్మాణ కట్టడాల కూల్చివేత ఘటనపై మాజీమంత్రి పేర్ని నానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించలేదా? నేను ఎవరినీ పేరు పెట్టి బాడీ షేమింగ్ చేయలేదు. పోలీసులు ఏకవచనంతో దూశించలేదా? నాకు కొత్తగా పబ్లిసిటీ కావాలా? ప్రభుత్వం తప్పులను ప్పశ్నించడమే నా ఉద్యోగం. నన్ను జైలులో పెట్టినా ప్రశ్నిస్తా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.