ఉపాధ్యాయులు గుణాత్మక విద్య బోధనలు అందించాలి: కలెక్టర్

WNP: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఇందులో భాగంగా వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ మేరకు పాఠశాలను తిరిగి పరిశీలించిన కలెక్టర్ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ. 31 లక్షలు ఉన్నాయని వాటిని గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.