VIDEO: 'కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయింది'
JGL: మాజీమంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందన్నారు. ప్రజలు KCR రావాలని కోరుకుంటున్నారని, ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునేవారని, ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోందన్నారు. పీసీసీ తప్పు చేసి నింద ఏఐసీసీపై వేస్తోందని అన్నారు.